
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం
నల్లగొండ: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆది వారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగం పటిష్ట పరచడంలో టీఎస్ యూటీఎఫ్ సభ్యులు ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు సకాలంలో అందించినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పీఆర్‌సీ గడువు తీరినందున పీఆర్‌సీ రిపోర్టు వెంటనే తెప్పించుకొని అమలు పరచాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి , ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు, ప్రతినిధులు నర్రా శేఖర్‌రెడ్డి, బి.అరుణ, వడ్త్యా రాజు, ఎడ్ల సైదులు, రామలింగయ్య, గేర నరసింహ, యాట మధుసూదన్‌రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, చినవెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, మధుసూదన్‌రెడ్డి, నర్సింహమూర్తి, భానుప్రకాష్, గిరి యాదగిరి, యరనాగుల సైదులు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి