‘జయ’ విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు శనివారం వెలువడిన నీట్ ఫలితా ల్లో జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కళాశాలకు చెందిన వి. నీతు 22,360, అవనీష్ 31,548, డి. వంశీ 80,101, జి. రాహుల్ 1,55,808, టి. తరుణ్ 1,61,298వ ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. 13 మంది విద్యార్థుల్లో ఐదుగురు మెడికల్ సీట్లు పొందినట్లు చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు.
‘జయ’ విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు
‘జయ’ విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు
‘జయ’ విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు


