సైనిక్ గురుకుల కళాశాల విద్యార్థిని ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర
బీబీనగర్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల 2021–2024 బ్యాచ్ విద్యార్థిని వి.కావ్య ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు.ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 28వ తేదీన దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ కార్యాలయానికి వెళ్లి విధుల్లో చేరనున్నారు. కళాశాల నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికై న మొదటి విద్యార్థి కావ్య అని ప్రిన్సిపాల్ తెలిపారు. కావ్యను ప్రన్సిపాల్ శ్రీలత, కళాశాల కార్యదర్శి వర్షిణి, సహాయ కార్యదర్శి పీఎస్‌ఆర్ శర్మ, ఉప కార్యదర్శి రజిని, అధ్యాపకులు అభినందించారు.
వాట్సాప్ గ్రూపులో తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసు
మోత్కూరు : మండలంలోని ముశిపట్ల గ్రామ వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ నాయకులపై తప్పుడు పోస్టు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డి.నాగరాజు తెలిపారు. వివరాలు.. ఈ నెల 6వ తేదీన మావూరి ముచ్చట్లు (ముశిపట్ల) గ్రూపులో కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నేర్లకంటి శ్రీనివాస్, బోనగిరి హరీష్ పోస్టు చేశారు. ఆ గ్రామానికి చెందిన నిమ్మల రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భవన నిర్మాణ కూలీ మృతి
వలిగొండ : భవన నిర్మాణ పనికి వెళ్లిన వ్యక్తి పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని వేములకొండలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నపాక బాబు అనే వ్యక్తి రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులకు దినసరి కూలీగా వెళ్తున్నాడు. చిన్నపాక బాబు గురువారం వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
బైక్ ఢీకొని సీనియర్
జర్నలిస్ట్ దుర్మరణం
చివ్వెంల(సూర్యాపేట) : బైక్ ఢీకొట్టడంతో జర్నలిస్ట్ మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండల కేంద్రంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చెరుపల్లి సత్యం (70) మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద రహదారి దాటుతుండగా మోతె నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం, తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సత్యంను సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


