నేడు జాతీయ లోక్ అదాలత్
రామగిరి(నల్లగొండ) : జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు తెలిపారు. జూన్ 9 నుంచి 14 వరకు చెక్ బౌన్స్ కేసులకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్‌లో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, భూ వివాదాలు, సైబర్ క్రైం కేసులు, ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు.
పేదలందరికీ ఇళ్లు
మంజూరు చేస్తాం
మునుగోడు : కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని కల్వకుంట్ల, కిష్టాపురం గ్రామాల్లో శుక్రవారం ఆయన పలు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనపటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, ఎంపీఓ స్వరూపరాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ సర్పంచ్‌లు పగిళ్ల భిక్షం, నందిపాటి రాధారమేష్, నాయకులు బొందు రవి తదితరులు పాల్గొన్నారు.
పథకాలపై ఆవగాహన కల్పించాలి
నాంపల్లి : ప్రభుత్వం అందిస్తున్న పథకలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. నాంపల్లిలోని సీ్త్రశక్తి భవనంలో మహిళా సమాఖ్య, వీఓల శిక్షణ కార్యక్రమనికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులకు పశువుల షెడ్లు, ఇండుకు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, అరుణ్‌కుమార్, ఏపీఎం వినోద్‌కుమార్, ఏపీఓ వెంకటేష్, సీసీలు తదితరులు ఉన్నారు.
రోగులకు మెరుగైన
వైద్య సేవలు అందించాలి
వేములపల్లి : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు వేణుగోపాల్‌రెడ్డి, కేస రవి, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ అరుంధతి, టీడీ ఆఫీసర్ కల్యాణ్‌చక్రవర్తి, డాక్టర్ సుచరిత, సీనియర్ అసిస్టెంట్ సోమ్లానాయక్, సూపర్‌వైజర్ శాంతమ్మ, గీతావాణి, అరుణ, నరేష్ పాల్గొన్నారు.
15న ఉచిత వైద్యశిబిరం
నల్లగొండ టౌన్ : పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి స్మారక ప్రజావైద్యశాల భవనంలో ఎంవీఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్టు కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ శిబిరానికి డాక్టర్ గోపాలం శ్రీమన్నారాయణ హాజరై రోగులకు ఉచితంగా షుగర్, బీపీ పరీక్షలు చేస్తారని, ఫిట్స్, పక్షవాతం రోగులకు కూడా పరీక్షలు చేస్తారని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
నేడు జాతీయ లోక్ అదాలత్


