
కలెక్టర్లదే ముఖ్యపాత్ర
ఫ మంత్రి కోమటిరెడ్డి
కేబినెట్ నిర్ణయాలను అమలు చేయడంలో కలెక్టర్లదే ముఖ్యపాత్ర అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్నింటా ముందుంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున అదనపు గోదాములు మంజూరు చేయడమే కాకుండా, క్లస్టర్లను, ఏఈఓ పోస్టులను మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తన శాఖ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అత్యధికంగా రూ.1,700 కోట్లను కేటాయించామని పేర్కొన్నారు.