
ఐఎఫ్‌ఎస్ ఫలితాల్లో నిఖిల్‌రెడ్డికి 11వ ర్యాంకు
మిర్యాలగూడ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) సోమవారం విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన చాడ నిఖిల్‌రెడ్డి జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించాడు. నిఖిల్‌రెడ్డి మిర్యాలగూడ పట్టణానికి చెందిన చాడ శ్రీనివాస్‌రెడ్డి– సునంద దంపతుల కుమారుడు. నిఖిల్‌రెడ్డి తల్లి సునంద పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా పని చేస్తుండగా, తండ్రి చాడ శ్రీనివాస్‌రెడ్డి వేములపల్లి మండల ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. నిఖిల్‌రెడ్డి ప్రాథమిక విద్యను మిర్యాలగూడలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్మీడియట్ విజయవాడ సమీపంలో గూడవలిల్లో చదివారు. ఐఐటీలో 91వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. 2019–20లో ఆడోబ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. యూపీఎస్పీ పరీక్షలకు ఐదుసార్లు హాజరై ఐదవసారి ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎంపికై న చాడ నిఖిల్‌రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు.