
వారసత్వ భూమి ఇప్పించండి..
స్వాతంత్య్ర సమరయోధుడైన నా తండ్రి గోపయ్య నుంచి నాకు రావాల్సిన భూమిని నా తమ్ముడు.. అతని భార్య పేరున పట్టా చేయించుకున్నాడు. దాన్ని రద్దు చేసి నాకు న్యాయం చేయాలంటూ కొంపల్లి వెంకటేశం విన్నవించారు. ఈ సమస్యపై పది సంవత్సరాల నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నాకు పుట్టుకతోనే పోలియో. నడవలేని పరిస్థితి. అప్పట్లో అటెండర్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలోని సర్వే నంబర్ 504లో అప్పటి ప్రభుత్వం నా తండ్రికి భూమి ఇచ్చింది. అది వారసత్వంగా కుమారులుగా సమానంగా రావాలి. కానీ నాకు రావాల్సిన ఎకరం భూమి నా చిన్న తమ్ముడు సత్యనారాయణ అతని భార్య పేరున పట్టా చేసుకున్నాడు. అది రద్దు చేసి నాకు రావాల్సిన ఎకరం భూమిని ఇప్పించాలని కోరాడు.
– కొంపల్లి వెంకటేశం, తాటికల్, నకిరేకల్ మండలం