
అమ్మా.. మా గోడు పట్టించుకోండి
నల్లగొండ : వివిధ సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులు మా గోడు పట్టించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి విన్నవించారు. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 97 దరఖాస్తులు రాగా వాటిలో రెవెన్యూ సంబంధించినవి 53, ఇతర సమస్యలకు సంబంధించినవి 44 ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిస్థితిని ఎప్పటికప్పుడు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమిత్‌నారాయణ్, రాజ్‌కుమార్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి ఉన్నారు.
ఫ గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ఎదుట బాధితుల వేడుకోలు
ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి