
జయ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు
సూర్యాపేటటౌన్: ఈఏపీసెట్ ఫలితాల్లో సూర్యాపేటలోని జయ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం వెలువడిన ఎప్‌సెట్ ఫలితాల్లో కళాశాలకు చెందిన కె. ఉజ్వన్ 141వ ర్యాంకు, జి. తేజశ్రీ 266, సీహెచ్. హన్షితశ్రీ 695, టి. అమూల్య 913, బి. లాస్య 917, పి. అమిత్ సూర్య 1948, బి. శివమణి 2270, డి. జగదీష్ రాజు 2935, వై. ప్రదీప్ 3364, కె. సాయినందన్ 3977, జి. నవదీప్‌రెడ్డి 4003, సీహెచ్. కుశల్ రాజు 5044, సీహెచ్. అక్షయ భారతి 5583, కె. యామిని 5823, ఎం. హన్సిని 5843, వి. బిందుమాధవి 6002, ఎస్. నక్షత్ర 6630, కె. పవన్ కుమార్ 7280, జి. సాయిరాం 8325, ఆర్. ప్రియదర్శిని 8328, ఎం. సాద్విక 8361, సీహెచ్. వైశాలిని 8449, జె. కీర్తన 8989, ఎ. కిషోర్ 9502 ర్యాంకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను ప్రిన్సిపాల్, కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు.