
ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా రాజ్‌కుమార్
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్‌ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఎస్సీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి డీడీగా కొనసాగారు. ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓఎస్‌డీగా వెళ్లడంతో ఆ బాధ్యతలను రాజ్‌కుమార్‌కు అప్పగించారు.
ఏర్పాట్ల పరిశీలన
నాగార్జునసాగర్ : ఈ నెల 12న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నాగార్జునసాగర్ సందర్శనకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి పరిశీలించారు. బుద్దపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరీమణులు బుద్దవనంలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో విజయ విహార్ అతిథి గృహం, బుద్దవనంలో ఏర్పాట్లపై సమీక్షించారు.
మెడికల్ వార్డు ఏర్పాటు
నాగార్జునసాగర్ : ఈ నెల 12న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నాగార్జునసాగర్ సందర్శనకు రానున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక మెడికల్ వార్డును ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వుల మేరకు ఐదు పడకలతో అత్యవసర చికిత్స నిమిత్తం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
12 హ్యాండ్ బాల్
జిల్లా జట్టు ఎంపిక
నకిరేకల్ : హ్యాండ్ బాల్ అసోసియేసిన్ ఆధ్వర్యంలో ఈనెల 12న నకిరేకల్ మండలం మంగళపల్లిలో జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో ఉదయం 12 గంటలకు జూనియర్ బాల బాలికల హ్యండ్ బాల్ జిల్లా జట్టు సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రదాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఎంపికై న జిల్లా జట్టు జూన్ 4 నుంచి 6 వరకు నకిరేకల్‌మండలం మంగళపల్లి జడ్పీ హైస్కుల్‌లో జరిగే 47 వతెలంగాణ రాష్ట్ర స్దాయి జూనియర్ బాల బాలికల హ్యండ్ బాల్ చాంపియన్ షీప్‌లో పాల్గొంటుందని తెలిపారు. ఈక్రీడల్లో పాల్గొనే వారు 1 జనవరి 2006 నుంచి 31 డిసెండర్ 2009 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు.

ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీగా రాజ్‌కుమార్