
ఏపీ ప్రభుత్వ దౌర్జన్యంపై జర్నలిస్టుల నిరసన
నల్లగొండ టూటౌన్ : సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయించడాన్ని ఖండిస్తూ జర్నలిస్టులు నల్లగొండ పెద్ద గడియారం సెంటర్‌లో గురువారం ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి బ్యూరో ఇన్‌చార్జి చింతకింది గణేష్, ఎడిషన్ ఇన్‌చార్జి బొడ్డు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తప్పులను ఎత్తిచూపితే ఏపీ ప్రభుత్వం పోలీసులతో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను ఏకంచేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వాస్తవాలను వెలికితీసి పత్రికల్లో రాస్తే ఏపీ ప్రభుత్వం కక్షకట్టి అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకోవాలని హితవుపలికారు. సాక్షి టీవీ ప్రతినిధి పాశం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెలికితీస్తున్న సాక్షి మీడియాపై, సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై దాడులు చేయించడం దారుణమైన విషయమన్నారు. జర్నలిస్టు సంఘాల బాధ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, గుండగోని జయశంకర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. వాస్తవాలను వెలికితీస్తే ప్రభుత్వం బెదిరించే ఽవిధంగా దాడులు, అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. అక్రమ కేసులు, దాడులను జర్నలిస్టు సంఘాలు ఉపేక్షించవన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఫయిమ్, రాతికింది అంజయ్య, మాదురి యాదయ్య, గాదె రమేష్, జర్నలిస్టులు కట్టా సుధాకర్, జిల్లా యాదయ్య, మీసాల శ్రీనివాస్, ఆవుల లక్ష్మయ్య, వంగాల శ్రీనివాసరెడ్డి, తుమ్మనగోటి వెంకట్, రాంప్రసాద్, శేఖర్, మధు, రవి, వేణు, శివశంకర్, నవీన్‌రెడ్డి, రషీద్, ఫొటో జర్నలిస్టులు కంది భజరంగ్ ప్రసాద్, కంది శ్రీనివాస్, భవాని ప్రసాద్, బత్తుల శ్రీనివాస్‌గౌడ్, సాక్షి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ నల్లగొండ గడియారం సెంటర్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ