
భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా..!
కోదాడ: కాశ్మీర్ లోయలో అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టికరిపించి, ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి మాజీ సైనికుడిగా తాను సెల్యూట్ చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యాక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. పీఓకేలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనేక సంవత్సరాలుగా స్ధావరాలను ఏర్పాటు చేసుకొని కాశ్మీర్ లోయలో అలజడులను సృష్టిస్తున్నారని అన్నారు. భారత సైన్యం ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించి ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించడం అభినందనీయన్నారు. తాను గతంలో భారత వైమానికదళంలో మిగ్ పైలెట్‌గా పనిచేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని, భారత్ సైన్యం ముందు పాకిస్తాన్ ఆటలు సాగవని ఆయన అన్నారు. ఈ సమయంలో దేశం మొత్తం సైన్యానికి అండగా నిలవాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు.
ఫ మాజీ సైనికునాగా ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతిస్తున్నా
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి