సాగు, తాగునీటి సమస్య రావొద్దు | - | Sakshi
Sakshi News home page

సాగు, తాగునీటి సమస్య రావొద్దు

Mar 17 2025 10:55 AM | Updated on Mar 17 2025 10:51 AM

నల్లగొండ : జిల్లాలో సాగు, తాగునీటితో పాటు విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, తాగు, సాగునీరు, విద్యుత్‌ సరపరాలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని.. పానగల్‌ ఉదయ సముద్రాన్ని నీటితో నింపాలని సూచించారు. వరి పంట కోత దశలో ఉందని ఒక్క ఎకరం కూడా ఎండకుండా నీటిని విడుదల చేయాలన్నారు. గతం కంటే ఈ సంవత్సరం లక్ష ఎకరాల్లో సాగు పెరిగిందని దాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు.

వ్యవసాయ మంత్రితో ఫోన్‌లో

మాట్లాడిన కోమటిరెడ్డి...

జిల్లాలో వ్యవసాయ క్లస్టర్లు, ఏఈఓ పోస్టులు జిల్లాలో తక్కువగా ఉన్నాయని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మంత్రి దృష్టికి తీసుకురాగా.. వెంటనే మంత్రి కోమటిరెడ్డి అక్కడ నుంచే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఫోన్‌ చేసి నల్లగొండ జిల్లాకు 80 ఏఈఓ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. అందుకు మంత్రి సమ్మతించారు.

మఖానా, ఆముదం సాగు చేస్తా

జిల్లాలో మఖానా పంట సాగుకు ఐదు ప్రాంతాలను ఎంపిక చేశామని అందుకు సంబంధించి అధ్యయనానికి శాస్త్రవేత్తలు, అధికారులను బిహార్‌కు పంపామని కలెక్టర్‌ తెలుపగా స్పందించిన మంత్రి తన సొంత గ్రామమైన బ్రాహ్మణవెల్లెంలలోని తన భూమిలో ఎకరం మఖానా పంట, మరో ఎకరం ఆముదం సాగు చేస్తానని చెప్పారు. ఆయా పంటలకు సంబంధించి తమ సూచనలు ఇవ్వాలని అక్కడే ఉన్న నార్కట్‌పల్లి ఏఓను కోరారు.

వినతులు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి అక్కడికక్కడే కొన్ని పరిష్కరించారు. కొన్ని కలెక్టర్‌కు చెప్పి.. సంబంధిత అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఇలా త్రిపాఠి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫ ఎకరం పంట కూడా

ఎండకుండా చూడాలి

ఫ ధాన్యం కొనుగోళ్లలో

ఇబ్బందులు కలగొద్దు

ఫ వేసవి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలి

ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాగు, తాగునీటి సమస్య రావొద్దు1
1/1

సాగు, తాగునీటి సమస్య రావొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement