మూసీ కాల్వలకు నీటి నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

మూసీ కాల్వలకు నీటి నిలిపివేత

Mar 15 2025 1:38 AM | Updated on Mar 15 2025 1:39 AM

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు శుక్రవారం అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. యాసంగిలో పంటల సాగుకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. అందులోభాగంగా మూడవ విడతగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు 22 రోజుల పాటు నీటిని విడుదల చేశారు. గడువు సమయం ముగియడంతో శుక్రవారం కుడి, ఎడమ కాల్వలకు నీటిరి నిలిపివేశారు. ఐదు రోజుల విరామం తర్వాత ఈ నెల 20 తేదీ నుంచి నాలుగో విడత నీటిని విడుదల చేయనున్నారు. 645 అడుగుల గరిష్ట నీటమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 630.50 (1.46 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

డ్రగ్స్‌ అనర్థాలపై వినూత్న ప్రచారం

వేములపల్లి : యువత డ్రగ్స్‌కు బానిసై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూర్యాపేట జిల్లా గోరుంట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌ శుక్రవారం ఆమనగల్లు జాతరలో యువతకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మద్యం, డ్రగ్స్‌ బారిన పడడం వల్ల పెడదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్‌ జోలికి వెళ్లకుండా సక్రమమైన మార్గంలో నడిచి మంచి పౌరులుగా ఉండాలన్నారు.

నేత్రపర్వం.. ఊంజల్‌ సేవోత్సవం

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఊంజల్‌ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్‌ సేవోత్సవం జరిపించారు. ఆండాళ్‌దేవికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన హక్షమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు.

మూసీ కాల్వలకు నీటి నిలిపివేత1
1/2

మూసీ కాల్వలకు నీటి నిలిపివేత

మూసీ కాల్వలకు నీటి నిలిపివేత2
2/2

మూసీ కాల్వలకు నీటి నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement