
జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి
నల్లగొండ టౌన్ : తల్లిదండ్రులు పిల్ల ల ప్రేమను ప్రోత్సహించొద్దు. ముందుగా తమ పిల్లలను సక్రమంగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి. ఒకవేళ ప్రేమ వివాహం చేసుకున్నా చంపడం, దాడులు చేయడం, కేసులపాలు కావడం మంచి పద్ధతి కాదు. ప్రతిష్టకు పోయి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. సామరస్యంగా రెండు కుటుంబాలు కలిసి సమస్య పరిష్కరించుకుంటే మంచిది. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారిని సరైన మార్గంలో పయనించేలా దిశా నిర్దేశం చేయాలి. వారి ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే గమనించి వారు సరైన రీతిలో ఉండేలా తల్లిదండ్రులు సూచనలు చేయాలి. – డాక్టర్ సుబ్బారావు,
మానసిక వైద్య నిపుణుడు, నల్లగొండ