
నడిగూడెం మండలం సిరిపురంలో సేంద్రియ పద్ధతిలో సాగులో ఉన్న పశుగ్రాసం
నడిగూడెం : సేంద్రియ వ్యవసాయమే కాదు నేడు సేంద్రియ పద్ధతిలో పశుపోషణ కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నదని నడిగూడెం మండల పశువైద్యాధికారిణి డాక్టర్ బి.అఖిల చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ పాలు, పాల పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. సేంద్రియ పశుపోషణలో పొదుగు వాపు సమస్యలు తక్కువగా గమనించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే సేంద్రియ పాలల్లో కలుషితాలు, సూక్ష్మజీవుల సంఖ్య సాధారణ పాల కంటే తక్కువగా, పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, పర్యావరణ పరిరక్షణకు చేయూతనిచ్చే సేంద్రియ ఽపశుపోషణను ఆచరించడం ఉత్తమని పేర్కొంటున్నారు.
సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన మేతనే వాడాలి
u సేంద్రియ పద్ధతిలో ఒంగోలు, పుంగనూరు, తార్కార్కర్, దియోని తదితర దేశీయ పశువుల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
u సేంద్రియ వ్యవసాయం ఆచరించిన భూమిలో పశువులు పెరిగినవై ఉండాలి.
u ఇందుకు రైతులు సొంత భూమిని 1–3 సంవత్సరాల కాలంలో ఎలాంటి రసాయన అవశేషాలు, కృత్రిమ ఎరువులు లేకుండా కృషి చేసి, సిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమం.
u పశువులను కట్టివేయకుండా పచ్చిక బయళ్లలో తిరిగే విధంగా, ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా తిరగనివ్వాలి.
u పశువు స్వభావం, ప్రవర్తనకు అనుకూలంగా ఉండే విధంగా పోషించాలి.
u సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన మేతనే వాడాలి. ఎలాంటి ఎరువులు, క్రిమికీటక సంహారక మందులు మేతపై వాడకూడదు.
u పునరుత్పత్తికి కృత్రిమ గర్భధారణ విధానాన్ని పాటించవచ్చు. హార్మోన్‌లు వాడరాదు.
u ఆరోగ్యపరిరక్షణకు అత్యవసర పరిస్థితుల్లో హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలు ఆచరించాలి. తప్పనిసరి పరిస్థితులలో టీకాలు వాడవచ్చు.
పశువుల పేడ అద్భుతమైన సేంద్రియ ఎరువు. ఇందులో 0.30 శాతం నత్రజని, 0.18 శాతం భాస్వరం, 0.18 శాతం పొటాష్, 0.36 శాతం సున్నం, 0.18 శాతం పొటాష్, తదితర పోషకాలు ఉంటాయి. అలాగే పశువుల మూత్రంలో 1.21 శాతం నత్రజని, 1.01. శాతం భాస్వరం, 1.31 శాతం పొటాష్, 1.01. శాతం సున్నం ఉంటాయి. రాష్ట్రం మొత్తం మీద లభ్యమయ్యే పశువుల పేడను 83శాతం ఎరువు, 10 శాతం పిడకలు, 7 శాతం ఇతర అవసరాలకు వాడుతున్నారు. ప్రతి పశువు నుంచి ఏటా దాదాపు 4 మెట్రిక్ టన్నుల పేడ, 3వేల లీటర్ల మూత్రం లభిస్తుంది. పశువుల పేడను ఎరువుగా వాడుకుంటే యూరియా, సింగిల్ సూపర్ పాస్పేట్, మ్యూరెట్ పొటాష్‌లను సరితూగే పోషకాలు లభిస్తాయి. పశువుల పేడ సేంద్రియ వ్యవసాయం విజయవంతం కావడానికి, అధిక ఉత్పత్తులు సాధించడానికి అవసరం. పశుగ్రాసాల సాగుకు తోడ్పతుంది. పశువుల పేడతో వానపాములు ఎరువు తయారు చేసుకోవచ్చు.
● పేడ ద్వారా ప్రత్యాన్మాయ ఇంధన వనరులైన బయోగ్యాస్ పొందవచ్చు.25 కిలోల పేడతో 500 గ్రాముల ఎల్‌పీజీకి సమానమైన బయోగ్యాస్ లభిస్తుంది. అలాగే పేడ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.
● పశువులు కలిగిన రైతులు బయోగ్యాస్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.
● ఆవు పేడలో 18 రకాల ఖనిజాలున్నాయని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల క్రితమే నిర్ధారించారు. గోమూత్రం, గోమయాన్ని ఆయుర్వేద వైద్యులు దాదాపు 32 రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నారు. గోవు ద్వారా లభించే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ అమృతంతో సమాన స్థాయిని పొందాయి. దేశవాళీ ఆవు పేడ, మూత్రానికి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. నేటి పరిస్థితుల్లో రైతుల ఇంట దేశవాళీ ఆవు ఉంటే బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.
పశువుల పేడ, మూత్రంతో ప్రయోజనాలు
నడిగూడెం పశువైద్యాధికారి డాక్టర్ బి.అఖిల

సేంద్రియ పద్ధతిలో పెరుగుతున్న ఆవులు

డాక్టర్ బి.అఖిల మండల పశువైద్యాధికారిణి, నడిగూడెం
