బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలి | - | Sakshi
Sakshi News home page

బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలి

Mar 29 2023 2:36 AM | Updated on Mar 29 2023 2:36 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి: దేశంలో మనువాద పాలన చేస్తున్న బీజేపీనీ ఓడించేందుకు తెలంగాణ సాయుధపోరాట స్ఫూర్తితో ప్రతిపక్షాలు ఏకం కావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరిలో సీపీఎం జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా ఎన్ని తేడాలున్నా విపక్షాలు ఒక్కటిగా పోరాడడానికి సీపీఎం ముందుంటుందని పేర్కొన్నారు. దేశ రక్షణ, ప్రజల హక్కులు, ప్రజాసామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం కోసం బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు. ప్రాంతీయ విభేదాలతో ముక్కలు చెక్కలు కాకుండా ఐక్యంగా ఉండడానికి లౌకిక వాదం ఉండాలన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై జరుగుతున్న దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌పార్టీకి అన్యాయం జరిగితే ప్రతిపక్షాలు ఐక్యం కావాలని అంటున్నారని, ప్రతిపక్షాలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం కాంగ్రెస్‌కు ఐక్యత గుర్తుకురాదన్నారు. తెలంగాణ, కేరళలో గవర్నర్‌లు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను తమ కుర్చీలో వేసుకుని కుర్చున్నారన్నారు. 2024లో బీజేపీ తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజాసామ్యం నిలబడుతుందన్నారు. సభలో సీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఎస్‌. వీరయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యరవ్గసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి దుంపల మల్లారెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌ గూడూరు అంజిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మంగ నర్సింహులు, కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్‌రెడ్డి ఉన్నారు.

భువనగిరిలో సీపీఎం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న రాఘవులు

భువనగిరిలో సీపీఎం జన చైతన్యయాత్ర ర్యాలీ

ఫ ఎన్ని తేడాలున్నా విపక్షాలు కలిసిపోవాలి

ఫ భువనగిరి బహిరంగ సభలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

ఆకట్టుకున్న కళా ప్రదర్శన

కేంద్ర ప్రభుత్వం అలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానలకు వ్యతిరేకంగా చేపట్టిన సీపీఎం జన చైతన్య యాత్ర భువనగిరి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో చైతన్య యాత్ర ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని రైల్వే స్టేషన్‌ నుంచి దుంపల మల్లారెడ్డి స్మారక భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్య మండలి డప్పు చప్పుట్లు, పూల వర్షంతో ర్యాలీ సాగింది. అనంతరం దుంపల మల్లారెడ్డి స్మారక భవనం సముదాయాన్ని అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement