వేగంగా.. సులభంగా | - | Sakshi
Sakshi News home page

వేగంగా.. సులభంగా

Apr 4 2026 8:19 AM | Updated on Apr 4 2026 8:19 AM

మీసేవలోనే దరఖాస్తులు..

కొత్త విధానంలో ఇలా..

డిజిటల్‌ పద్ధతిలో..

ఇకపై నకిలీ ధ్రువపత్రాల జారీకి అడ్డుకట్ట

మొబైల్‌ యాప్‌ ద్వారా పాదర్శకంగా జారీ

ముందుగా ఆదాయ

సర్టిఫికెట్లతో శ్రీకారం

జాప్యం, లోపాలను సరిదిద్దడమే

లక్ష్యంగా చర్యలు

గతంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం జీపీఓల వద్దకు దరఖాస్తుదారులు వెళ్లేవారు. మీసేవకు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేక యాప్‌ ద్వారా జీపీఓ లాగిన్‌లోకి వస్తుంది. ఆయన విచారణ చేసి వాటిని ఆర్‌ఐకి పంపిస్తారు. ఆర్‌ఐ పరిశీలన తర్వాత తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకంతో సర్టిఫికెట్‌ వస్తుంది.

– సైదులు,

తహసీల్దార్‌, అచ్చంపేట

అచ్చంపేట: సర్టిఫికెట్ల జారీలో పాదర్శకత పెంచేందుకు ప్రభుత్వం డిజిటల్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాన్యువల్‌గా జరిగే విచారణతో కలిగే జాప్యాన్ని నివారిస్తూ, డిజిటల్‌ యాప్‌ ద్వారా సేవలను వేగవంతం చేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఈవి ధానం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

మారుతున్న విధానం..

గతంలో కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం మీసేవలో దరఖాస్తు చేస్తే అది నేరుగా నాయబ్‌ తహసీల్దార్‌ లాగిన్‌కు వెళ్లేది. ఇక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి(ఆర్‌ఐ) ఆపై క్షేత్రస్థాయి పరిశీలనకు పంపేవారు. కానీ, కొత్త విధానంలో అభ్యర్థి మీసేవలో దరఖాస్తు చేసుకోగానే అది నేరుగా గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) లాగిన్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి (ఆర్‌ఐ)కి, ఆపై నాయబ్‌ తహసీల్దార్‌కు డిజిటల్‌ రూపంలో ఫార్వర్డ్‌ అవుతుంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.

డిజిటల్‌ యాప్‌లో వివిధ రకాల సర్టిఫికెట్లు

ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులకు కాలం చెల్లింది. సామాన్యులకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదాయ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పూర్తి డిజిటల్‌ పద్ధతి, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఆదాయం సర్టిఫికెట్‌ పొందాలంటే దరఖాస్తుదారుడు తహసీల్దార్‌ ఆఫీస్‌లో దరఖాస్తు నింపి, దానిపై గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ), మండల రెవెన్యూ అధికారి (ఆర్‌ఐ)తో సంతకాలు తీసుకోవాల్సి వచ్చేది. అనంతరం మీసేవలో ఆన్‌లైన్‌ చేసి, మళ్లీ మాన్యువల్‌ కాపీలను సమర్పించిన తర్వాతే తహసీల్దార్‌ లాగిన్‌కు వెళ్లేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement