జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రవికాంతరావు | - | Sakshi
Sakshi News home page

జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రవికాంతరావు

Mar 27 2026 10:08 AM | Updated on Mar 27 2026 10:08 AM

సాక్షి, నెట్‌వర్క్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రవికాంతరావు ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మధుసూదన్‌రావు తెలిపారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌కు సంబంధించిన ఎన్నికలను జిల్లా కోర్టు ఆవరణలో గురువారం నిర్వహించారు.

● కల్వకుర్తి సీనియర్‌ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఎస్‌.మల్లేష్‌, అచ్చంపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వెంకటరమణ, కొల్లాపూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా భూజల భాస్కర్‌రెడ్డి ఎన్నికయ్యారు.

ఎఫ్‌ఎల్‌ఎస్‌ బోధనపై ప్రత్యేక శ్రద్ధ

లింగాల: ఆయా పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎస్‌ బోధనపై శ్రద్ధ తీసుకుంటున్నామని మండల విద్యాధికారి బషీర్‌ అహ్మద్‌ అన్నారు. మండలంలోని అవుసలికుంట పాఠశాలను గురువారం ఎంఈఓ తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరును పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement