తిమ్మాజిపేట: మండలంలోని బావాజిపల్లి, మరికల్, నేరళ్లపల్లి గ్రామాల్లో గురువారం ప్రత్యేక పశు వైద్య శిబిరాలను నిర్వహించారు. 244 తెల్ల పశువులకు, 174 గేదె జాతి పశువులకు టీకాలు వేసినట్లు డాక్టర్ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మయ్య, జేవీఓ విజయ, పశువైద్య సిబ్బంది తిరుపతయ్య, అమీర్, యాదగిరి, శాంతయ్య, గోపాలమిత్రలు, పలువురు రైతులు పాల్గొన్నారు.
బల్మూర్: మండలంలోని రాంనగర్, గోపాలరావు నగర్, సీతారాంపురం గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. 418 పశువులకు టీకాలు వేశారు. రాంనగర్ సర్పంచ్ లక్ష్మీగోపాల్, బల్మూరు మండల పశువైద్యాధికారి డాక్టర్ అనిల్, డాక్టర్ మహేశ్వరి, పారా వెటర్నరీ సిబ్బంది కిషోర్, శ్రీమంజు, వెంకటయ్య, కరీం, గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు. .


