చేపలు పెరగడం లేదు..
చేపల వృత్తినే నమ్ముకు ని బతుకుతున్న మాకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకం. కానీ, జూన్‌లో వదలాల్సిన చేపపిల్లలను అక్టోబర్, నవంబర్‌లో వేస్తున్నారు. దీంతో సీజ న్ ప్రకారం తదుపరి వచ్చే మే నెల వరకు చేప లు అంతగా పెరగడం లేదు. ప్రతిసారి ఇలాగే చేస్తుండటంతో మేలు జరగకపోవడంతోపాటు సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. వర్షాకాలం ప్రారంభంలోనే చేపపిల్లలు చెరువుల్లో వదలితే నే ప్రయోజనం ఉంటుంది. – ఇప్పలి జనార్దన్,
మత్స్యకారుడు, కొనగట్టుపల్లి,
హన్వాడ మండలం, మహబూబ్‌నగర్


