ఆరోగ్య రక్షణలోవ్యాక్సినేషన్ కీలకం
తిమ్మాజిపేట/బిజినేపల్లి: ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకు తగ్గట్లుగా వైద్యసిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా. రవికుమార్ నాయక్ సూచించారు. బుధవారం తిమ్మాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బిజినేపల్లి, పాలెం పీహెచ్‌సీలు, వట్టెం సబ్ సెంటర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టిక, వ్యాక్సిన్ లాగిన్ బుక్స్ తదితర వాటిని పరిశీలించారు. ఆయా ఆస్పత్రుల్లోని వైద్యసిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎన్‌సీడీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న వైద్యసేవలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. వేసిన ప్రతి టీకా వివరాలను సక్రమంగా నమోదు చేయడం అత్యవసరమన్నారు. ఆయన వెంట సీహెచ్‌ఓ శ్రీనివాసులు, వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఫార్మసీ అధికారి బాలరాజు, వైద్య సిబ్బంది ఉన్నారు.
అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు
వెల్దండ: దక్షిణ కాశీగా పేరొందిన మండలంలోని గుండాలలో బుధవారం అడిషనల్ కలెక్టర్ అమరేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పౌర్ణమి కావడంతో శైవ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం వేదాశీర్వచనం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ కార్తీక్ కుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
17న ‘చలో ఢిల్లీ’
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ అన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, సంక్షేమ హాస్టళ్లను సంబంధించి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతిఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కమలాకర్, నాయకులు సుధాకర్, నాగేంద్రకుమార్, రమేష్, పండు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య రక్షణలోవ్యాక్సినేషన్ కీలకం


