
విద్యార్థుల అగచాట్లు!
వర్కర్లను ఏర్పాటు చేస్తాం..
● కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల డెయిలీ వైజ్ కార్మికుల సమ్మె
● మరుగుదొడ్లు, మూత్రశాలలను
శుభ్రంచేసే వారు కరువు
● భోజనం రుచికరంగా లేక
విద్యార్థుల అవస్థలు
● హాస్టల్ నుంచి ఇళ్లకు
తీసుకెళ్తున్న తల్లిదండ్రులు
–10లో u
●
కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే డెయిలీ వైజ్ కార్మికుల సమ్మె విద్యార్థులకు శాపంగా మారింది. ఓవైపు సరైన సమయానికి ఆహారం వండి వడ్డించే వారు లేక.. మరోవైపు పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లను శుభ్రం చేసే వారు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినులే వంట చేస్తున్నారు. ఈ క్రమంలో భోజనం రుచికరంగా లేక చాలామంది పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
ఆందోళనలో తల్లిదండ్రులు..
కల్వకుర్తి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వారం రోజులుగా ఆహారం సరిగ్గా వడ్డించడం లేదని విద్యార్థినులు నిరసన బాట చేపట్టారు. మంగళవారం రాత్రి ఆహారం సరిగా లేక తినకపోగా.. బుధవారం ఉదయం సైతం వంతుకు గంతేసినట్లుగా ఆహారాన్ని అందించడంతో విద్యార్థినులు తరగతులను బహిష్కరించి హాస్టల్ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే, కొందరు విద్యార్థినులు రోజుకు ఒక్కపూటే భోజనం చేస్తున్నామని చెబుతున్నారు. పరిస్థితి తారాస్థాయికి చేరడంతో విద్యార్థినులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో 380 మంది విద్యార్థినులకు ప్రస్తుతం 250 మంది మాత్రమే ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
కార్మికుల సమ్మెతో సమస్యలు..
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీ వైజ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 34 రోజుల క్రితం సమ్మె బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. కార్మికుల సమ్మె కారణంగా హాస్టల్ పరిసరాల్లో కుక్క చనిపోతే దుర్వాసనతోనే ఉంటున్నారు తప్ప.. దాన్ని తొలగించే వారే కరువయ్యారని విద్యార్థినులు వాపోతున్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే డెయిలీ వైజ్ వర్కర్లు సమ్మెలోకి వెళ్లడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాఠశాల విద్యార్థుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. ఇతర ప్రాంతాల నుంచి వర్కర్లను తీసుకొచ్చి పనులు చేయిస్తాం. రెండు రోజుల్లో హాస్టల్‌లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– ఫిరంగి, డీటీడీఓ

విద్యార్థుల అగచాట్లు!

విద్యార్థుల అగచాట్లు!