
మేమే వంట చేస్తున్నాం..
వర్కర్ల సమ్మె కారణంగా ఉపాధ్యాయులు, విద్యార్ధినులం కలసి వండుకొని తింటున్నాం. కింది తరగతుల విద్యార్థినులకు ఇబ్బంది కలగకుండా 10వ తరగతి విద్యార్థినులమంతా వంతుల వారీగా ఉపాధ్యాయులకు సహకరిస్తున్నాం. ఇతర వర్కర్లను నియమించి అయినా మాకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
– నందిని, 10వ తరగతి విద్యార్థిని
నెలరోజులుగా బాత్రూంలను శుభ్రంచేసే వారు లేక దుర్వాసన పెరిగిపోవటమే కాకుండా, వ్యాధులు వచ్చే అవకాశాలు పెరిగిపోయాయి. ఎవరికి తోచినట్లుగా వారే బాత్రూంలను శుభ్రం చేసుకొని వినియోగిస్తున్నారు. హాస్టల్‌లో పరిసరాలను శుభ్రం చేయకపోవడంతో విషపురుగులు వస్తున్నాయి. మా ఇబ్బందులను పట్టించుకోవడానికి ఉన్నతాధికారులు ఎవరూ రావడం లేదు.
– పవిత్ర, 10వ తరగతి విద్యార్థిని
నా కూతురు శ్రావణి ఇక్కడే 10వ తరగతి చదువుతుంది. గత వారం నుంచి హాస్టల్‌లో సరిగా ఆహారం అందించడం లేదని.. పెట్టిన రుచికరంగా లేదని ఫోన్‌లో ఏడుస్తూ చెప్పడంతో హాస్టల్‌కు వచ్చాను. ఇక్కడకు వచ్చి చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించకపోతే విద్యార్థినులను ఇంటికి తీసుకెళ్లక తప్పేటట్టు లేదు.
– శేఖర్, విద్యార్థిని తండ్రి, జకినాలపల్లి

మేమే వంట చేస్తున్నాం..

మేమే వంట చేస్తున్నాం..