జాతీయస్థాయికి నల్లమల విద్యార్థి ప్రయోగం | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయికి నల్లమల విద్యార్థి ప్రయోగం

Oct 16 2025 6:44 AM | Updated on Oct 16 2025 6:44 AM

జాతీయ

జాతీయస్థాయికి నల్లమల విద్యార్థి ప్రయోగం

బల్మూర్‌: దక్షణ భారతదేశ స్థాయి రాజ్య స్టారియా (ఆర్‌ఎస్‌బీవీపీ) బాలవైజ్ఞానిక ప్రదర్శనలో బల్మూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి గగన్‌చంద్ర ప్రదర్శించిన త్రీ ఇన్‌ వన్‌ సైకిల్‌ ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఈ మేరకు బుధవారం డీఈఓ కార్యాలయం నుంచి సమాచారం అందిందని పాఠశాల హెచ్‌ఎం నరేందర్‌రెడ్డి తెలిపారు. బల్మూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న గగన్‌చంద్ర గత జనవరి 21 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో నిర్వహించిన దక్షణ భారతదేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తాను రూపొందించిన త్రీ ఇన్‌ వన్‌ సైకిల్‌ ప్రయోగాన్ని ప్రదర్శించి ప్రతిభ చాటారు. సోలార్‌తో నడిచే ఈ త్రీ ఇన్‌ వన్‌ సైకిల్‌ నవంబర్‌ 18 నుంచి 23 వరకు భూపాల్‌లో జరిగే జాతీయ స్థాయి (ఆర్‌ఎస్‌బీవీపీ)కి ఎంపికై ందని తెలిపారు. విద్యార్థిని నిరంతరం ప్రోత్సహిస్తూ వస్తున్న గైడ్‌ టీచర్‌ సీతారాం, తల్లిదండ్రులు భాస్కర్‌, నాగరాణిలకు జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలిపారు.

పాఠశాల స్థల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే..

బిజినేపల్లి: మండలంలోని పాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీఎస్పీ నాయకులు అన్నారు. మంగళవారం ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన ‘బడి జాగాకే ఎసరు’ కథనానికి వివిధ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. బుధవారం బీఎస్పీ నాయకులు పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలెంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం తోటపల్లి సుబ్బయ్య, గోవిందు చెన్నప్ప, మనుసాని బాల్‌లింగయ్య పేర్లపై ఉన్న భూములను దానం చేశారని తెలిపారు. ఆ స్థలంలో ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్‌, పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటుచేసినట్లు వివరించారు. కొందరు రాజకీయ నాయకులు పాఠశాల స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని ఆరోపించారు. పాఠశాల స్థలాన్ని కాపాడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో నాయకులు పానుగంటి రాంచందర్‌, పృథ్వీరాజ్‌, ఆర్మీ రిటైర్డ్‌ జవాన్‌ వెంకటయ్య, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో విద్యారంగం బలోపేతం

వెల్దండ: విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు ముందుకుసాగాలని శిక్షకులు జంగయ్య, జహంగీర్‌ అన్నారు. వెల్దండ మోడల్‌ స్కూల్‌లో డివి జన్‌ స్థాయి భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సాంకేతిక విద్యపై ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. అందుకు అనుగుణంగా ఉ పాధ్యాయులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది ఉండాలన్నారు. విద్యార్థులకు కోడింగ్‌, ఆర్టిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై అవగాహన కలిగించేలా బోధనా ప్రణాళికలు సిద్ధం చేయాలని భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

జాతీయస్థాయికి నల్లమల విద్యార్థి ప్రయోగం 
1
1/1

జాతీయస్థాయికి నల్లమల విద్యార్థి ప్రయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement