
ఐసీడీఎస్‌ను నీరుగార్చేందుకు కుట్ర
కొల్లాపూర్: ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతమ్మ, మాసమ్మ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయాన్ని అంగన్‌వాడీ వర్కర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఎం శ్రీవిద్య ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులను కూడా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని నిర్ణయించడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాలతో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. పీఎం శ్రీవిద్య అమలు బాధ్యత అంగన్‌వాడీ వర్కర్లకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల పక్షాన నిలవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, ఏరియర్స్, రిటైర్మెంట్ బెని ఫిట్స్ చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహాలోనే జీతాలు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 25న చలో సెక్రటేరియట్ చేపడతామన్నారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయ ఓఎస్‌డీ కృష్ణయ్యకు వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నా యకులు పర్వతాలు, శివవర్మ, రామయ్య, రాము, రాజు, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.