
ఫిజియోథెరపీపై అవగాహన ఉండాలి
నాగర్‌కర్నూల్ క్రైం: శారీరక సమస్యల నివారణకు ఫిజియోథెరపీ చికిత్స ఎంతో ఉపయోగకరమని.. ప్రతి ఒక్కరూ ఫిజియోథెరపీపై అవగాహన కలిగి ఉండాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అ న్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పాత కలెక్టరేట్ భవనం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతి వ్యక్తి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. జీవనశైలిలో వచ్చే మార్పులకు అను గుణంగా మారాలని సూచించారు. అనంతరం తెలంగాణ ఫిజియోథెరపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో డా.రోహిత్, రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, యూత్ కోఆర్డినేటర్ కుమార్, తెలంగాణ ఫిజియోథెరపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎన్ సుమంత్, కార్యదర్శి చంద్రపాల్‌రెడ్డి, డా.సృజన, జి.లలిత, యశ్వంత్, రాజశేఖర శర్మ పాల్గొన్నారు.