
విద్యాప్రమాణాలపెంపునకు కృషి చేయాలి
కల్వకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికల్లో విద్యాప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. డీఈఓ స్వయంగా గణితం బోధించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. గణితశాస్త్రంలో మెళకువలు పాటిస్తే సులభంగా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలని ఉపాధ్యాయులకు డీఈఓ సూచించారు.