
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు
● రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిన బీఆర్‌ఎస్
● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వనపర్తి: రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పు ల కుప్పగా మార్చేశారని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. శనివారం పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి హాజరై లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలకులు పదేళ్ల కాలంలో రూ.8.19 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారని, ప్రజల దీవెనతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజామోద పాలన చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, రూ.రెండు లక్షల వరకు పంట రుణమాఫీ వర్తింపజేశామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామ న్నారు. ప్రజాపాలనలో తొలి విడతగా రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని చెప్పారు. రానున్న కాలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నా రు. భూ భారతి చట్టంతో భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు భరోసా కల్పించామన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం..
ఆర్థిక ఇబ్బందులున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఉమ్మడి పాలమూరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని ప్రజా ప్రభుత్వం మరో సారి నిరూపించిందని.. గతంలోనూ వైఎస్సార్ హ యాంలో ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు.
పేదోడి సొంతింటి కల సాకారం..
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చుతామని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో తొలివిడత నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హతనే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక చేసినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, బ్రహ్మం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.