
యూరియా కోసం తప్పని నిరీక్షణ
పెద్దకొత్తపల్లి సింగిల్‌విండో వద్ద బారులు తీరిన రైతులు
పెద్దకొత్తపల్లి: జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిత్యం ఎక్కడో చోట యూరియా కోసం బారులు తీరుతున్నారు. రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడి నానా అవస్థలు పడుతున్నారు. పెద్దకొత్తపల్లి సింగిల్‌విండోకు వారం రోజులుగా యూరియా రాలేదు. శనివారం రెండు లారీల యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. సింగిల్‌విండో కార్యాలయం చుట్టూ క్యూ కట్టగా.. అధికారులు పట్టాదారు పాస్‌పుస్తకంపై రెండు బస్తాల యూరియాను అందజేశారు. అయితే రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.