
వలస కూలీలను బడిలో చేర్పించి..
కొల్లాపూర్ మండలంలోని సింగోటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న భృంగ కృష్ణప్రసాద్ విద్యాబోధనతోపాటు నైపుణ్యాలను నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో సోమశిల పాఠశాలలో పనిచేయగా ప్రారంభంలో 80 మంది విద్యార్థులు ఉండగా, వారి సంఖ్యను 142కు పెంచారు. కృష్ణాతీరంలో వలస జీవులుగా ఉన్న మత్స్యకారుల పిల్లలను బడిలో చేర్పించారు. నదికి అవతలి వైపు ఉన్న విద్యార్థులను నిత్యం పాఠశాలకు చేరేలా బోటు ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం సింగోటం పాఠశాలలో తరగతి గదులను పేయింటింగ్‌తో అందంగా తీర్చిదిద్దా రు. ఈ పాఠశాలలో 72 మంది విద్యార్థుల నుంచి వారి సంఖ్యను 119కి పెంచడంలో ఎంతో కృషిచేశారు.

వలస కూలీలను బడిలో చేర్పించి..