
ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా డా.రవికుమార్
నాగర్‌కర్నూల్ క్రైం: ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డా.రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ బాదావత్‌సంతోష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి కూకట్‌పల్లికి డీఎంహెచ్‌ఓగా డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్ మట్లాడుతూ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలులో ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటామనని తెలిపారు.
మన్ననూర్‌లోఎఫ్‌డీఓ కార్యాలయం
మన్ననూర్: స్థానిక అటవీశాఖ చెక్‌పోస్టు సమీపంలోని అటవీ శాఖ విశ్రాంతి గృహం ఆవరణలో ఆ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ (ఎఫ్‌డీఓ) కార్యాలయానన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించారు. గతంలో ఇది అచ్చంపేటలో క్యాంపు కార్యాలయంగా కొనసాగుతుండేది. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్య స్థావరం మన్ననూర్ నుంచి కొనసాగుతుండడంతో ఎఫ్‌డీఓ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి, ఫ్‌లైయింగ్ ఎఫ్‌డీఓ రామ్మోహన్, ఎఫ్‌ఆర్‌ఓలు గురుప్రసాద్, వీరేష్, ఈశ్వర్ పాల్గొన్నారు.
శ్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలి
వెల్దండ: మహిళా సంఘాల సభ్యులు శ్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను బ్యాంకుల్లో సకాలంలో చెల్లించాలని డీఆర్‌డీఓ ఓబులేష్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని చెర్కూర్ గ్రామ మహిళా సంఘాల సభ్యులను కలిసి పెండింగ్‌లో రుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని 31 చిన్న సంఘాల సభ్యులు దాదాపుగా రూ.8లక్షల వరకు రుణాలను తీసుకున్నట్లు వివరించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో దాదాపుగా రూ.కోటి వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. గ్రామా ల్లో ఎంపీఎం, సీసీలు, సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి రుణాలు సకాలంలో చెల్లించే విధంగా చూడాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీదేవి, సీసీ గెల్వమ్మ, వీఓఏ వనిత ఉన్నారు.
‘బీఆర్‌ఎస్ వీడం..
గువ్వల వెంట నడవం’
అచ్చంపేట/అచ్చంపేట రూరల్: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగతమని, మేమందరం పార్టీలోనే కొనసాగుతామని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పోకల మనోహర్ స్పష్టం చేశారు. బుధవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీని వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో గువ్వలకే తెలియాలని, నియోకవర్గ బీఆర్‌ఎస్ పార్టీలో గ్రూపు తగదాలు లేవని, సమిష్టితో పనిచేస్తున్నారన్నారు. ఆయన నిర్ణ యం వల్ల పార్టీని నమ్ముకొన్న వారికి అన్యా యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గువ్వల పార్టీని వీడటం కార్యకర్తలెవరూ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రజలందరూ కూడా కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కోరు కుంటున్నారని, రానున్న రోజుల్లో పార్టీ మంచి భవిష్యత్ ఉందని జోస్యం చెప్పారు. వారం రోజుల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. పార్టీ నుంచి ఎవరు పోయిన నష్టం లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి పూర్వ వైభవం తీసుకొద్దా మని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు కె.తులసీరాం, నర్సింహాగౌ డ్, మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య, మా జీ ఎంపీపీలు పర్వతాలు, కర్ణాకర్‌రావు, కేటీ తిరుపతయ్య, కౌన్సిలర్లు అంతటి శివ, రమేష్‌రావు, కట్టా గోపాల్‌రెడ్డి, రవీందర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ నర్సయ్యయాదవ్ పొల్గొన్నారు.

ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా డా.రవికుమార్

ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా డా.రవికుమార్