
వైభవంగా అంజన్న పవిత్రోత్సవాలు
అమ్రాబాద్: పదర మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజేయస్వామి పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రధాన అర్చకులు వీరయ్యశర్మ బృందం వేదమంత్రాలతో శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, దీక్షాధారణ, వాస్తు శాంతి, తీర్థ ప్రసాద వితరణ గావించారు. సాయంత్రం యాగశాల ప్రవేశం, మృత్శంగ్రహణం, అంకురార్పణ, యాగశాలలో కళష స్థాపన, అగ్ని ప్రతిష్ట చేశారు. ఉత్సవాల్లో ఈఓ రంగాచారి, ప్రధాన అర్చకులు వీరయ్యశర్మ, సిబ్బంది విశ్వేశ్వరరెడ్డి, నాగరాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.