
ఎక్కడా యూరియా కొరత లేదు..
పట్టా మార్పిడికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్
పెద్దకొత్తపల్లి: వానాకాలం పంటసాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని.. ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి సింగిల్‌విండో భవనంలో యూరియా నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం మన గ్రోమర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని.. ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో 75 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఎరువులు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డుతో పాటు సాగుచేసిన పంటల వివరాలను నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. రైతులు మోతాదుకు మించి యూరియా వినియోగించొద్దని సూచించారు. డీఏఓ వెంట ఏఓ శిరీష, సహకార సంఘం ఇన్‌చార్జి రాములు తదితరులు ఉన్నారు.