
న్యాయం చేయాలి..
మాకు సర్వే నంబర్ 85/7లో మూడెకరాల లావుణి పట్టా భూమి ఉంది. భూమిని అక్రమంగా మరొకరు పట్టా చేసుకున్నారు. ఇప్పుడు భూమి మాదేనని అంటున్నారు. మాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.
– సురవేణి భాగ్యమ్మ, కోనేటిపూర్,
వంగూరు మండలం
ఫైళ్లు లేవు..
కోనేటిపురంలో అసైన్డ్ ల్యాండ్‌పై కొత్త పట్టాపాసుపుస్తకాలు పొందినట్టు మా దృష్టికి వచ్చింది. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై ఎలాంటి సమాచారం, ఫైళ్లు అందుబాటులో లేవు. ఉన్నతాధికారులకు నివేదించాం. దీనిపై విచారణ చేపట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– మురళీకృష్ణ,
తహసీల్దార్, వంగూరు మండలం
●