ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఆకస్మిక తనిఖీలు

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

వెంకటాపురం (ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట, జవహర్‌నగర్‌, పెద్దాపూర్‌ ఉపకేంద్రాలను జిల్లా మాతా సంరక్షణ ప్రోగ్రామ్‌ అధికారి చీర్ల శ్రీకాంత్‌, జిల్లా ఏసీడీ ప్రోగ్రామ్‌ అధికారి రంజిత్‌లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పెద్దాపూర్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి 9, 10వ తరగతి బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. బాలికల తల్లిదండ్రులకు కూడా వ్యాక్సిన్‌పై సరైన అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ అసంక్రమిత వ్యాధుల (ఏసీడీ) స్క్రీనింగ్‌ను పూర్తి చేయాలని ఆరోగ్య, ఆశ కార్యకర్తలను ఆదేశించారు. ఏసీడీ కార్యక్రమంలో 100 శాతం స్క్రీనింగ్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం(ఎం) పీహెచ్‌సీ సామాజిక ఆరోగ్య అధికారి మాడిశెట్టి శ్రీనివాస్‌, ఆరోగ్య కార్యకర్తలు నిరోష, వజ్రమ్మ, స్వర్ణలత, ఎంఎల్‌హెచ్‌పీ నవీన్‌, వైద్యాధికారి సంఘమిత్ర, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement