మ్యాపింగ్‌ ప్రక్రియపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ ప్రక్రియపై దృష్టి సారించాలి

Apr 5 2026 8:42 AM | Updated on Apr 5 2026 8:42 AM

వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి

ములుగు: మ్యాపింగ్‌ ప్రక్రియ పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌, బీఎల్‌ఓ, బూత్‌ ఏజెంట్లు తదితర అంశాలపై ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దివాకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియలో పురోగతి సాధించాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులు మ్యాపింగ్‌ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్‌ స్థాయి ఏజెంట్ల నియామకం చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, బూత్‌స్థాయి ఏజెంట్ల నియామకంపై సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement