మండల ప్రత్యేకాధికారిగా డీపీఓ వెంకయ్య | - | Sakshi
Sakshi News home page

మండల ప్రత్యేకాధికారిగా డీపీఓ వెంకయ్య

Feb 10 2026 7:58 AM | Updated on Feb 10 2026 7:58 AM

మండల

మండల ప్రత్యేకాధికారిగా డీపీఓ వెంకయ్య

మంగపేట: మండల ప్రత్యేకాధికారిగా జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను నియమిస్తూ అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) సంపత్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మండల ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్న డీఈఓ సిద్ధార్థరెడ్డి స్థానంలో డీపీఓను నూతనంగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మండలంలో 2011 నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగక పోవడంతో ప్రజాప్రతినిధులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పంచాయతీ అధికారి మండల స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టనుండడంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హైస్కూల్‌ సందర్శన

వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సోమవారం ములుగు జిల్లా ప్యానల్‌ టీం సభ్యుల బృందం జనగాం బాబురావు, హజీ, శ్రీనివాస్‌, హామీద్‌, నాగేశ్వర్‌రావులు సందర్శించి పాఠశాల సమగ్ర ప్రగతిని పరిశీలించారు. విద్యా ప్రగతికి సంబంధించిన విషయాలతో పాటు పాఠశాల మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల హాజరుశాతం, గ్రేడుల వివరాలు పరిశీలించిన తర్వాత మౌలిక వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆర్‌ఓ ప్లాంట్‌ ద్వారా తాగునీటి లభ్యత, మరుగుదొడ్ల సక్రమ నిర్వహణ, రుచికరమైన మధ్యాహ్న భోజనం తదితర విషయాల్లో పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రార్థన సమయం నుంచి సాయంత్రం పాఠశాల ముగిసే వరకు పాఠ్యాంశాలతో పాటు జరిగే ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

‘సకాలంలో పనులు పూర్తిచేయాలి’

కన్నాయిగూడెం: నీతి ఆయోగ్‌ ఆస్పీరేషనల్‌ బ్లాక్‌లో నిర్వహించ తలపెట్టిన పనులన్నీ వందశాతం సకాలంలో పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి, ఈజీఎస్‌ ఏపీడీ వెంకటనారాయణ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఆస్పీరేషనల్‌ బ్లాక్‌లో చేపట్టిన సంపూర్ణ అభియాన్‌ 2.0ను రైతు వేదికలో సోమవారం ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆస్పీరేషనల్‌ కో ఆర్డినేటర్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఐసీడీఎస్‌, విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు ఆరు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. అధికారులు పనుల్లో అలసత్వం చేయకుండా సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం సీడీపీఓ ప్రేమలత మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణుల ఎత్తు, బరువు చూడాలన్నారు. అదే విధంగా వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సర్వర్‌, ఎంపీడీఓ ఇన్‌చార్జ్‌ సాజిదాబేగం, మండల విద్యాశాఖ అధికారి సాంబయ్య, మండల శిశు సంక్షేమ అధికారి ప్రేమలత, ఐకేపీ ఏపీఎం సతీశ్‌, ఏపీఓ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కోటగుళ్లలో పూజలు

గణపురం: మండలకేంద్రంలోని కాతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆశుతోష్‌ పాండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకటలక్ష్మీనరసింహారావుతో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. వారిని ఆలయ అర్చకుడు నాగరాజు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

సోమవారం ప్రత్యేక పూజలు

కోటగుళ్లలో సోమవారం సందర్భంగా గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు స్వా మి వారిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు దర్శించుకున్నారు.

మండల ప్రత్యేకాధికారిగా డీపీఓ వెంకయ్య
1
1/2

మండల ప్రత్యేకాధికారిగా డీపీఓ వెంకయ్య

మండల ప్రత్యేకాధికారిగా డీపీఓ వెంకయ్య
2
2/2

మండల ప్రత్యేకాధికారిగా డీపీఓ వెంకయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement