భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 14 నుంచి 16 వరకు జరుగు మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగొద్దని కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన కాళేశ్వరం దేవస్థానం సమావేశ మందిరంలో మహాశివరాత్రి జాతర నిర్వహణ ఏర్పాట్లపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన మహాశివరాత్రి జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత సమర్థవంతమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా భద్రత, రాకపోకలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవలు, పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్‌పోస్టర్లను సబ్ కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఈఓ మహేష్‌తో కలిసి క్యూలైన్‌లు, భద్రత ఏర్పాట్లపై చర్చించారు. సబ్‌కలెక్టర్ పాతనక్ష రహదారిని సర్పంచ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, తహసీల్దార్ రామారావు, డీటీ యూసఫ్, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, ఎస్సై తమాషారెడ్డి, రెవెన్యూ సిబ్బంది శ్యామ్‌తో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్
కాళేశ్వరంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్ష
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు


