ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు
● అదనపు కలెక్టర్ సంపత్‌రావు
ములుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్‌లో మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయించినట్లు అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జనరల్ అబ్జర్వర్ గంగాధర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు మూడో ర్యాండమైజేషన్ ద్వారా మొత్తం 20 మంది ప్రిసైడింగ్ అధికారులు, 20 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 60 మంది ఇతర పోలింగ్ అధికారులను కేటాయించారు. ఈ సందర్భంగా ఆరుగురిని సూక్ష్మ పరిశీలకులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అదే విధంగా 20 శాతం రిజర్వ్ సిబ్బందిని కూడా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఈడీఎం దేవేందర్ పాల్గొన్నారు.
13 వరకు అవగాహన సదస్సులు
ఆర్‌బీఐ పిలుపు మేరకు కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్‌పై అవగాహన పెంచేందుకు ఆర్థిక అక్షరాస్యత వారంగా నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంకు జిల్లా అధికారి జయప్రకాశ్ తెలిపారు. అదనపు కలెక్టర్లు సంపత్‌రావు, మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్‌లచే పోస్టర్లను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. నేటి నుంచి సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.


