విద్యార్థులకు నీళ్ల చారుతోనే భోజనం
ఏటూరునాగారం: మండల పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు నీళ్లచారుతో భోజనం వడ్డించడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో వివిధ హాస్టళ్లలో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కొండాయి ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ గత కొన్ని నెలలుగా నీళ్ల చారుతోనే భోజనం వడ్డిస్తూ నాణ్యతలేని ఆహారం పెడుతున్నారన్నారు. ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ గిరిజన సంక్షేమ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. విధులకు కూడా సదరు వార్డెన్ సక్రమంగా హాజరు కావడం లేదన్నారు. అలాగే హాస్టల్‌లో ఫ్యాన్లు, మరుగుదొడ్లు సరిగా లేవన్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి నెలకొందని తెలిపారు. తక్షణమే సదరు వార్డెన్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి అశోక్
విద్యార్థులకు నీళ్ల చారుతోనే భోజనం


