ఎన్నికల నిబంధనలు పాటించాలి
వాజేడు/వెంకటాపురం(కె):స్థానిక సంస్థల ఎన్నికల నియమనిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్‌కుమార్ అధికారులకు సూచించారు. వాజేడు మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. అలాగే నాగారం, మొరుమూరు, గుమ్మడిదొడ్డి గ్రామాల్లోని కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయ, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్‌ఐ కుమారస్వామి, డీటీ రాంసింగ్ ఉన్నారు. అలాగే నాగారంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని హెల్ప్‌డెస్క్ సిబ్బందికి సూచించారు. అదే విధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలోని బీసీ మర్రిగూడెం, పాత్రాపురం, వెంకటాపురంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ప్రశాంత్‌కుమార్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్‌కుమార్


