సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
ములుగు రూరల్: పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో స్పెషల్ పార్టీ సిబ్బందితో సమావేశం నిర్వహించి సిబ్బంది సంక్షేమం, భద్రత తదితర అంశాలపై చర్చించారు. సిబ్బందికి ఫీల్డ్‌లో ఎదురవుతున్న పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం సిబ్బంది ఆరోగ్యం, భద్రత, విశ్రాంతి సౌకర్యాలపై ఆరా తీశారు. స్పెషల్ పార్టీ పోలీసులు జిల్లా భద్రతలో అతి ముఖ్యమైన ప్రాత పోషిస్తున్నారని తెలిపారు. స్పెషల్ పార్టీ పోలీసులకు అవసరమయ్యే రక్షణ సామగ్రిని సమకూర్చుతామని ఎస్పీ వివరించారు. అనంతరం స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ 2014 బ్యాచ్‌కు చెందిన కిరణ్ హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతి పొందగా ఎస్పీ శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో కష్టపడిన వారికి ఉద్యోగోన్నతులు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఆర్‌ఐ ఆపరేషన్స్ తిరుపతి, ఆర్‌ఎస్సైలు గోపిచంద్, ప్రశాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్


