ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌

Dec 5 2025 6:54 AM | Updated on Dec 5 2025 6:54 AM

ఎన్ని

ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌

ములుగు: పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కును విని యోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవకాశం కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టీఎస్‌.దివాకర తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని హైదరాబాద్‌ నుంచి గురువారం వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్‌ దివాకర , అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) సంపత్‌రావు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాల్లో ఉప సర్పంచ్‌ ఎన్నిక, పోస్టల్‌ బ్యాలెట్‌ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్‌ రివ్యూ నిర్వహించారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న చోట ఉప సర్పంచ్‌ ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని, ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామ సర్పంచులకు సంబంధించి ఫలితాలు నిబంధనల ప్రకా రం ప్రకటించాలని సూచించారు. అనంతరం అధి కారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు చేసుకున్న దరఖాస్తు పరిశీలించి అర్హులకు తప్పకుండా అందించాలన్నారు. ప్రతీ గ్రామం, మండలాల వారీగా వివరాలు సేకరించి సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేసేలా చూడాలన్నారు. మొదటి విడత పోలింగ్‌ జరిగే గ్రామాల్లో ఓటుహక్కు ఉండి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది డిసెంబర్‌ 8న, రెండో విడత వారికి 12న, మూడో విడత వారికి 15న ఫెసిలిటేషన్‌ కేంద్రాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ సూచించారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌, సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్ల నియామకం చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ సీఎం రోశయ్య సేవలు చిరస్మరణీయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌ రావుతో కలిసి కలెక్టర్‌ హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థికశాఖ మంత్రిగా ఎన్నోసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారని, సీఎంగా పని చేసి రాష్ట్రాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేశారని తెలిపారు. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసి విశిష్ట సేవలు అందించారని వెల్లడించారు. రాజకీయాల్లో స్వచ్ఛమైన వ్యక్తిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ రాజ్‌కుమార్‌, పర్యవేక్షకులు మహేశ్‌ బాబు, మంజుల తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌1
1/1

ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement