విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Dec 5 2025 6:54 AM | Updated on Dec 5 2025 6:54 AM

విధుల

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కన్నాయిగూడెం: వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు హెచ్చరించారు. గురువారం సాక్షిలో మారని వైద్యుల తీరు శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డీఎంహెచ్‌ఓ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి జరిగిన ఘటనపై ఆరా తీశారు. సిబ్బంది రోగులకు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో డీఎంహెచ్‌ఓతో పాటు జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి పవన్‌ కుమార్‌, డాక్టర్‌ గిరిబాబు సిబ్బంది పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో

ఆడిట్‌ బృందం తనిఖీ

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అకాడమిక్‌ ఆడిట్‌ బృందం గురువారం తనిఖీ నిర్వహించింది. కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజెస్‌ ఎడ్యూకేషన్‌ తెలంగాణ ఆదేశాల మేరకు ఆడిట్‌ బృందం అకాడమిక్‌ రికార్డులను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో హనుమకొండలోని పింగిలి డిగ్రీ కళాశాల పిన్సిపాల్‌, ప్రొఫెసర్‌ చంద్రమౌళి, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్‌ అధ్యాపకులు రవీందర్‌ పాల్గొన్నారు. ఈ తనిఖీ బృందానికి కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.బాలయ్య, న్యాక్‌ కో ఆర్డినేటర్‌ జగదీశ్‌, అకాడమిక్‌ కో ఆర్డినేటర్‌ భాస్కర్‌ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

ములుగు రూరల్‌: జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రాంనాథ్‌ కేకన్‌ జిల్లా జడ్జి ఎస్‌వీపీ సూర్యచంద్రకళను గురువారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ, పోలీస్‌ శాఖల మధ్య సమన్వయం, కేసులు త్వరితగతిన పరిష్కారానికి అవసరమైన సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు ఎస్పీ వెల్లడించారు.

డీటీడీఓగా నాగసాగర్‌

ఏటూరునాగారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా డీటీడీఓగా గొట్టిముక్కుల నాగసాగర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో హనుమకొండ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న నాగసాగర్‌కు భూపాలపల్లి డీటీడీఓగా బాధ్యతుల అప్పగించారు. ఆయన శుక్రవారం విధుల్లో చేరనున్నారు.

సైబర్‌ నేరాలపై

అవగాహన ఉండాలి

ములుగు: సైబర్‌ నేరాలపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ నందిరాంనాయక్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని సమ్మక్క– సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ప్రాడ్‌కా ఫుల్‌స్టాఫ్‌, 6 వారాల సైబర్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌లో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వ్యక్తిగత సమాచారాన్ని, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్‌, ఓటీపీ వివరాలను ఎవరితో పంచుకోవద్దని సూచించారు. అపరిచిత లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని, ఫోన్‌ ద్వారా వచ్చే అటాచ్‌మెంట్‌ లింక్‌లను తెరవవద్దని వెల్లడించారు. డిజిటల్‌ అరెస్ట్‌, బెదిరింపుల గురించి భయపడవద్దన్నారు. మోసానికి గురైతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కు కాల్‌ చేయాలన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు1
1/5

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు2
2/5

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు3
3/5

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు4
4/5

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు5
5/5

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement