చదువుతోనే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ దివాకర
ములుగు రూరల్: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ నిర్మించుకోవచ్చని కలెక్టర్ దివాకర అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహింస్తున్న ఈఎల్‌ఎఫ్ ఇంగ్లిష్ లెర్న్ టు రైట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఇంగ్లిష్‌లో ఇంటర్‌ూయ్వ నిర్వహించి అభిరుచులు, రోల్ మోడల్ పై ముఖాముఖి నిర్వహించారు. బాలల దినోత్సవంపై రోల్ ప్లే చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, దిశ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముబీన్, సునీల్ తదితరులు ఉన్నారు.


