పుస్తకపఠనంపై ఆసక్తి పెంచుకోవాలి
ములుగు రూరల్ : విద్యార్థులు పుస్తకపఠనంపై ఆసక్తి పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ పితామహుడు ఎస్‌ఆర్ రంగనాథన్, జవహర్‌లాల్ నెహ్రూ, సరస్వ తి మాత చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలను వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సిద్ధార్థరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, పీఏసీఎస్ చైర్మన్ సత్తిరెడ్డి, ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణబాబు ఉన్నారు.


