జాగ్రత్తలు పాటించాలి
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వృద్ధులు, చిన్న పిల్లలు చలినుంచి జాగ్రత్తలు పాటించాలి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. చలిని తట్టుకునే విధంగా దుస్తులు ధరించాలి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో భాధపడుతున్నవారు చలికి గురికాకుండా వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రతీఒక్కరు గోరువెచ్చని నీటినే తాగాలి. దగ్గు, దమ్ము, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
– చీర్ల శ్రీకాంత్,
వైద్యాధికారి, వెంకటాపురం(ఎం)


