వెంకటాపురం(ఎం): మహిళలు చదువుకుంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుందని డీఈఓ సిద్ధార్థరెడ్డి అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉల్లాస్ శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడానికి ఉల్లాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిరక్ష్యరాస్యులైన ప్రతి మహిళ అక్షరాస్యులుగా గుర్తింపు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఉల్లాస్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ కృష్ణబాబు, ఆడిషనల్ డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఎపీఎం ధర్మేంధ్ర, సీసీలు, తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ములుగు రూరల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండలంలోని మదనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. రైతులు పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. దళారును ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పీఏసీఎస్ చైర్మన్ సత్తిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, చాంద్‌పాషా తదితరులు ఉన్నారు.
పాఠశాలలో
న్యాయ విజ్ఞాన సదస్సు
ములుగు రూరల్: మండల పరిధిలోని జాకారం బాలికల పాఠశాలలో శుక్రవారం బాల దినోత్సవం సందర్భంగా జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ ఈగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ మాట్లాడుతూ.. బాల, బాలికల చేతిలోనే దేశ భవిష్యత్ ఉందన్నారు. అనంతరం డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాసు బాల కార్మిక చట్టాలు, బాల్య వివాహ చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100కు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనిత, ఉపాధ్యాయులు లలిత, రజిత, శిరీష తదితరులు ఉన్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఉద్యమం తప్పదని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు పెంచాలని అన్నారు. రాష్ట్రంలో ఏఎన్‌ఎంల పనిభారం తగ్గించాలని కోరారు. రాత పరీక్ష పూర్తయి పెండింగ్‌లో ఉన్న 2,246 ఏఎన్‌ఎం పోస్టులు, 2,300 నర్సింగ్ ఆఫీసర్స్, 1,284 ఎల్‌టీ, 735 ఫార్మసిస్టు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ చర్యలు చేపట్టాని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రల వేతనాలు పెంచాలని, 104 ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వాలని, స్వంత జిల్లాలో నియమించాలని అన్నారు. ఈ నెల 18న సంగారెడ్డిలో నిర్వహించే రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, సుధాకర్, జమున రాణి, పద్మ, వజ్ర, విజయలక్ష్మి, సులోచన, స్వప్న తదితరులు ఉన్నారు.
మహిళల చదువుతోనే కుటుంబ అభివృద్ధి
మహిళల చదువుతోనే కుటుంబ అభివృద్ధి


