కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ములుగు రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని బండారుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. రైతులు తమ పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దేవ్‌సింగ్, రాజన్న, అశోక్, దేవయ్య, నాగరాజు, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్


